TRS: బూర న‌ర్స‌య్య గౌడ్ గుణ‌గ‌ణాల‌ను కీర్తిస్తూ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి ట్వీట్‌

bjp leader konda vishweshwar reddy interesting tweet on ex mp boora narsaiah goud
  • టీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరే దిశ‌గా భువ‌నగిరి మాజీ ఎంపీ
  • న‌ర్స‌య్య గౌడ్ ఉన్న‌త విద్యావంతుడ‌న్న విశ్వేశ్వ‌ర‌రెడ్డి
  • మ‌ద్యం ముట్ట‌ని నేత‌గా గౌడ్‌ను పేర్కొన్న వైనం
తెలంగాణ‌లో అధికార పార్టీ టీఆర్ఎస్‌కు వీడ్కోలు ప‌లికి బీజేపీలో చేరే దిశ‌గా సాగుతున్న భువ‌న‌గిరి మాజీ ఎంపీ బూర న‌ర్స‌య్య గౌడ్‌పై... ఇటీవ‌లే బీజేపీలో చేరిన చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి శుక్ర‌వారం ట్విట్ట‌ర్ వేదికగా ఓ ఆస‌క్తిక‌ర ట్వీట్‌ను పోస్ట్ చేశారు. ఈ ట్వీట్‌లో బూర న‌ర్స‌య్య గౌడ్ గుణ‌గ‌ణాల‌ను కీర్తిస్తూ విశ్వేశ్వ‌ర‌రెడ్డి ఆస‌క్తిక‌ర అంశాల‌ను ప్ర‌స్తావించారు.

డాక్ట‌ర్ బూర న‌ర్స‌య్య గౌడ్ ఎవ‌రు? అంటూ ట్వీట్‌ను మొద‌లుపెట్టిన విశ్వేశ్వ‌ర‌రెడ్డి... ఉన్న‌త విద్యావంతుడ‌ని, సీనియర్ గ్యాస్ట్రోఎంట‌రాల‌జిస్ట్ అని కొనియాడారు. ఆ తర్వాత వ‌ల్గ‌ర్ లాంగ్వేజీ మాట్లాడే విష‌యంలో ఫేమ‌స్ కాద‌ని, భూ క‌బ్జాల్లో కూడా ఫేమ‌స్ కాద‌ని, నేరాల్లో కూడా ఫేమ‌స్ కాద‌ని చెప్పిన విశ్వేశ్వ‌ర‌రెడ్డి... మ‌ద్యం ముట్ట‌ని నేత న‌ర్స‌య్య గౌడ్ అని పేర్కొన్నారు. టీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరే దిశ‌గా న‌ర్స‌య్య గౌడ్ సాగుతున్న వేళ‌...ఆయ‌న‌ను కీర్తిస్తూ విశ్వేశ్వ‌ర‌రెడ్డి చేసిన ఈ కామెంట్లు ఆస‌క్తిక‌రంగా మారాయి.
TRS
BJP
Telangana
Boora Narsaiah Goud
Konda Vishweshwar Reddy
Social Media
Twitter

More Telugu News