స్కాన్ చేయగానే వేడి వేడి ఇడ్లీలు.. బెంగళూరులో ఆకలి తీర్చే ఇడ్లీ ఏటీఎం!

 Idli ATM in Bengaluru video Viral
  • ఫ్రెషాట్ పేరిట ఏర్పాటు చేసిన ఇడ్లీ ఏటీఎం 
  • నెట్ లో వైరల్ గా మారిన వీడియో
  • ఎక్స్ ట్రా చట్నీ కావాలంటే ఎలా అని నెటిజన్ల సెటైర్
భారత ఐటీ రాజధాని బెంగళూరు ఎన్నో దిగ్గజ సంస్థలకు నెలవు. ఆ నగరంలో మరెన్నో వినూత్న ఆలోచనలో అంకురాలు పురుడు పోసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఓ చోట ఏర్పాటు చేసిన ఇడ్లీ ఏటీఎం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ ప్రత్యేకమైన యంత్రం వీడియో ఇప్పుడు ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది.  బి పద్మనాభన్ అనే వ్యక్తి  షేర్ చేసిన వీడియోలో ఇడ్లీ ఏటీఎం ఎలా పని చేస్తుందో ఓ మహిళ వివరిస్తుంది. 

ఫ్రెషాట్ పేరిట ఏర్పాటు చేసిన ఈ ఇడ్లీ ఏటీఎం ఔట్ లెట్ ను చూపించడంతో ఈ వీడియో ప్రారంభం అవుతుంది. లోపలికి వెళ్లిన తర్వాత క్యూఆర్ కోడ్ తో ఆర్డర్‌ ఎలా చేయాలో వివరిస్తుంది. కేవలం 50 సెకన్లలో ఇడ్లీ తయారవుతుందని, ఆకర్షణీయంగా చేసిన డబ్బాలో పార్సిల్ బయటికి వస్తుందని ఆమె చెప్పింది. రుచి కూడా బాగుందని సదరు మహిళ తెలిపింది. నెట్ లో ఈ వీడియో వైరల్ అవ్వగా.. ఇడ్లీ ఏటీఎంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కొంతమంది సాంకేతికతను చూసి ఆశ్చర్యపోతే, మరికొందరు ఎక్స్ ట్రా చట్నీ  ఎలా అడుగుతారు? అంటూ ప్రశ్నలు అడుగుతున్నారు.
Go Back to Shorts
Bengaluru
idli
ATM
Viral Videos

More Telugu News