Telangana: తెలంగాణ‌లో ఈ ఏడాది 100 శాతం సిల‌బ‌స్‌తో ఇంట‌ర్ ప‌రీక్ష‌లు

telangana inter board states that this year inter exams with100 percent syllabus
  • రెండేళ్లుగా 70 శాతం సిల‌బ‌స్‌తో ఇంట‌ర్ ప‌రీక్ష‌లు
  • క‌రోనా ప్ర‌భావం త‌గ్గ‌డంతో వంద శాతం సిల‌బ‌స్‌తో ప‌రీక్ష‌ల నిర్ణ‌యం
  • 100 శాతం సిల‌బ‌స్ ప్ర‌శ్నాప‌త్రాల‌ను ఆన్‌లైన్‌లో పెట్టిన ఇంట‌ర్ బోర్డు
తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంట‌ర్మీడియ‌ట్ ఎడ్యుకేష‌న్ శుక్రవారం ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ ఏడాది నిర్వ‌హించే ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను వంద శాతం సిలబ‌స్‌తో నిర్వ‌హించాల‌ని బోర్డు నిర్ణ‌యించింది. ఈ మేర‌కు ఇంట‌ర్ బోర్డు కార్య‌ద‌ర్శి న‌వీన్ మిట్ట‌ల్ ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు. అంతేకాకుండా వంద శాతం సిల‌బ‌స్‌తో కూడిన ఇంట‌ర్ ప్ర‌శ్నాప‌త్రాల‌ను బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు.

క‌రోనా కార‌ణంగా గ‌డ‌చిన రెండేళ్లుగా 70 శాతం సిల‌బ‌స్‌తోనే ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. అయితే క‌రోనా ప్ర‌భావం పూర్తిగా త‌గ్గ‌క‌పోయినా... దాని ప్ర‌భావం అంత‌గా క‌నిపించ‌ని నేప‌థ్యంలో తాజాగా ఇంట‌ర్ బోర్డు వంద శాతం సిల‌బ‌స్‌తో ప‌రీక్ష‌ల నిర్ణ‌యం తీసుకుంది.
Telangana
Intermediate Exams
Board Of Intermeduate Education
Naveen Mittal

More Telugu News