Varanasi Court: శివ‌లింగానికి కార్బ‌న్ డేటింగ్ కుద‌ర‌దు!... జ్ఞాన‌వాపి కేసులో వార‌ణాసి కోర్టు తీర్పు!

varanasi court refuses to carbon dating to sivalingam in gnanavapi msjid case
  • జ్ఞాన‌వాపి మ‌సీదులో బ‌య‌టప‌డ్డ శివ‌లింగం
  • శివ‌లింగానికి కార్బ‌న్ డేటింగ్ చేయించాలంటూ హిందూ సంఘాల పిటిష‌న్లు
  • పిటిష‌న్ల‌ను కొట్టివేసిన వార‌ణాసి కోర్టు
జ్ఞాన‌వాపి మ‌సీదు కేసులో శుక్ర‌వారం వార‌ణాసి కోర్టు సంచ‌ల‌న తీర్పు చెప్పింది. మ‌సీదులో ల‌భ్య‌మైన శివ లింగానికి కార్బ‌న్ డేటింగ్ చేయించాలంటూ ప‌లు హిందూ సంస్థలు దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ల‌ను కోర్టు కొట్టివేసింది. శివ లింగానికి కార్బ‌న్ డేటింగ్ చేయించేందుకు అనుమ‌తి నిరాక‌రిస్తున్న‌ట్లు కోర్టు తెలిపింది. 

శివ లింగానికి కార్బ‌న్ డేటింగ్ చేయిస్తే... మ‌సీదు కంటే ముందు అక్క‌డ ఆల‌య‌మే ఉంద‌న్న విష‌యం తేలిపోతుంద‌ని భావించిన హిందూ సంఘాలు... శివ లింగానికి కార్బ‌న్ డేటింగ్ చేయించాలంటూ కోర్టును ఆశ్ర‌యించాయి. అయితే కోర్టు అందుకు అంగీక‌రించ‌లేదు. దీంతో ఈ వ్య‌వ‌హారంపై హిందూ సంస్థ‌లు ఉన్న‌త న్యాయ స్థానాల‌ను ఆశ్ర‌యించే దిశ‌గా అడుగులు వేస్తాయా? అన్నది వేచిచూడాలి. 
Varanasi Court
Hindu Organisations
Gnanavapi Masjid

More Telugu News