5జీపై గర్విస్తున్నాం.. కావాలంటే ఇతర దేశాలకూ టెక్నాలజీ ఇస్తాం: నిర్మలా సీతారామన్
- భారతదేశంలో 5జీని పూర్తిగా దేశీయంగా రూపొందించామన్న కేంద్ర ఆర్థిక మంత్రి
- కొన్ని పరికరాలను మాత్రం దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకున్నట్టు వెల్లడి
- అమెరికా పర్యటనలో విద్యార్థులతో ముచ్చటించిన నిర్మలా సీతారామన్
కొన్ని పరికరాలు మాత్రమే..
భారత దేశంలో 5జీ సేవలను ప్రారంభించినా.. ఇంకా ప్రజలకు పూర్తిస్థాయిలో అందాల్సి ఉందని నిర్మలా సీతారామన్ తెలిపారు. 5జీ టెక్నాలజీలో చాలా భాగం దేశంలోనే అభివృద్ధి చేశామని.. దక్షిణ కొరియా వంటి ఇతర దేశాల నుంచి కొన్ని పరికరాలను మాత్రం తెప్పించుకున్నామని వివరించారు. 5జీ విషయంగా భారత్ విజయంపై గర్వపడుతున్నట్టు చెప్పారు.