Ch Malla Reddy: మునుగోడులో రాజగోపాల్‌ రెడ్డి ఓటమి ఖాయం: మంత్రి మల్లారెడ్డి

Komatireddy will loose in Munugode says Malla Reddy
  • కోమటిరెడ్డి ఒక 420 అన్న మల్లారెడ్డి
  • మునుగోడులో టీఆర్ఎస్ దే విజయమన్న మంత్రి
  • అభివృద్ధి కావాలంటే టీఆర్ఎస్ ను గెలిపించాలన్న సబితా ఇంద్రారెడ్డి
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ను గెలిపించి, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని మంత్రి మల్లారెడ్డి కోరారు. ఈరోజు చౌటుప్పల్ మండలంలో ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. మునుగోడు ప్రజలను మోసం చేసిన కోమటిరెడ్డి ఒక 420 అని అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఓటు వేయాలని కోరారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ దే విజయమని ధీమా వ్యక్తం చేశారు. 

మరోవైపు మంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లి మండలంలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కూసుకుంట్లను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రజల కోసం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. మునుగోడు అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ ను గెలిపించాలని అన్నారు.
Ch Malla Reddy
Sabitha Indra Reddy
KCR
Donald Trump
Munugode
Komatireddy Raj Gopal Reddy
BJP

More Telugu News