చంద్రబాబుపై విమర్శలు ఆపకపోతే కొడాలి నానిని ప్రజలు పోస్టుమార్టం చేస్తారు: బుద్ధా వెంకన్న

  • నిన్న కొడాలి నాని ప్రెస్ మీట్
  • చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు
  • వార్నింగ్ ఇచ్చిన బుద్ధా వెంకన్న
  • కొడాలి నాని గురించి కొన్ని విషయాలు బయటపెడతానని వెల్లడి
వైసీపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి కొడాలి నాని నిన్న టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లను  ప్రస్తావిస్తూ చంద్రబాబుపై నిప్పులుచెరిగారు. దీనిపై టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న స్పందించారు. 

చంద్రబాబుపై కొడాలి నాని అనవసర విమర్శలు మానుకోవాలని హెచ్చరించారు. లేకపోతే కొడాలి నానిని పోస్టుమార్టం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. హరికృష్ణ, వైఎస్సార్ లలో ఎవరు గొప్ప అంటే నాని ఏం సమాధానం చెబుతారని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. వైఎస్సార్ చనిపోయినప్పుడు కొడాలి నాని తదితరులు ఏంచేశారో త్వరలోనే బయటపెడతానని వెల్లడించారు.

Budda Venkanna
Kodali Nani
Chandrababu
TDP
YSRCP

More Telugu News