Chandrababu: ప్రొద్దుటూరులో టీడీపీ ఇన్చార్జి ప్రవీణ్ కుమార్ అరెస్ట్... పోలీసుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం

Chandrababu condemns police arrested TDP incharge Praveen Kumar in Proddutur
  • ప్రవీణ్ కుమార్ అరెస్ట్ ను ఖండిస్తూ చంద్రబాబు ట్వీట్
  • ప్రవీణ్ నివాసంపై రౌడీలు దాడి చేశారని వ్యాఖ్య 
  • సమాచారం ఉన్నా పోలీసులు అడ్డుకోలేకపోయారని ఆరోపణ
  • తిరిగి బాధితుడిపైనే అక్రమ కేసు పెట్టారని ఆగ్రహం
కడప జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ ఇన్చార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి అరెస్ట్ పై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. ప్రొద్దుటూరులో ప్రవీణ్ కుమార్, ఇతర టీడీపీ నేతల అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. 

ప్రవీణ్ ఇంటిపై వైసీపీ రౌడీమూకలు దాడిచేస్తున్నాయన్న సమాచారం ఉండి కూడా పోలీసులు అడ్డుకోలేదంటే, రాష్ట్రంలో రక్షణ వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో తెలుస్తోందని చంద్రబాబు విమర్శించారు. రౌడీల దాడి నుంచి రక్షించాల్సిన పోలీసులు, దాడి జరిగాక వచ్చిన బాధితుడి పైనే అక్రమకేసు పెట్టారంటే ఏమనుకోవాలి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజల నుంచి జీతం తీసుకుంటూ వైసీపీకి ఊడిగం చేస్తున్న పోలీసుల తీరు డిపార్ట్ మెంట్ కే అవమానం అని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రవీణ్ ను, టీడీపీ నేతలను వెంటనే విడుదల చేసి దాడికి పాల్పడిన రౌడీలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
Chandrababu
Praveen Kumar Reddy
Arrest
TDP
Police
Proddutur
Kadapa District

More Telugu News