Balakrishna: సంక్రాంతి సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న బాలయ్య!

  • షూటింగు దశలో బాలకృష్ణ 107వ సినిమా 
  • రీసెంట్ గా టర్కీ షెడ్యూల్ షూటింగు పూర్తి
  • రేపటి నుంచి హైదరాబాదు షెడ్యూల్ మొదలు 
  • సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేసే ఆలోచన
Balakrishna in Gopichand Malineni movie

బాలకృష్ణ 107వ సినిమా షూటింగు దశలో ఉంది. గోపీచంద్ మలినేని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమాలో కథానాయికగా శ్రుతి హాసన్ అలరించనుంది. మొదలుపెట్టిన దగ్గర నుంచి చకచకా షూటింగు చేస్తూ వస్తున్నారు.

రీసెంట్ గా 'టర్కీ' షెడ్యూల్ ను పూర్తిచేశారు. హీరో .. హీరోయిన్ కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించారు. ఆ తరువాత షెడ్యూల్ ను హైదరాబాద్ సమీపంలోని మొయినా బాద్ లో ప్లాన్ చేశారు. రేపటి నుంచి ఈ సినిమా షూటింగు మొదలెట్టనున్నట్టుగా చెబుతున్నారు. ప్రధానమైన పాత్రల కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

ఈ సినిమాలో ప్రతినాయకుడిగా దునియా విజయ్ కనిపించనున్నాడు. బాలకృష్ణ డిఫరెంట్ లుక్ తో ఈ సినిమాలో కనిపించనున్నారు. 'అఖండ' హిట్ తరువాత బాలయ్య .. 'క్రాక్' హిట్ తరువాత గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి నుంచి కూడా బాలకృష్ణకి సంక్రాంతి సెంటిమెంట్ ఎక్కువ. సంక్రాంతి బరిలో ఆయన అందుకున్న సక్సెస్ లు ఎక్కువ. అందువలన ఈ సినిమాను జనవరి 12వ విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

More Telugu News