Congress: రేవంత్ రెడ్డి స‌హా టీ కాంగ్రెస్ నేత‌ల‌కు క్లాస్ తీసుకున్న కేసీ వేణుగోపాల్‌

congress party general secretary kc venugopal anger over t congress leaders
  • త్వ‌ర‌లోనే తెలంగాణ‌లోకి ప్ర‌వేశించ‌నున్న రాహుల్ యాత్ర‌
  • యాత్ర ఏర్పాట్ల‌పై స‌మీక్ష కోసం హైద‌రాబాద్ వ‌చ్చిన వేణుగోపాల్‌
  • జోడో యాత్ర‌పై తెలంగాణ‌లో ప్ర‌చార‌మే జ‌ర‌గ‌డం లేద‌ని అసంతృప్తి
  • ప‌బ్లిసిటీలో ముందుండే రేవంత్‌... జోడో ప‌బ్లిసిటీలో వెనుక‌బ‌డ్డార‌ని వ్యాఖ్య‌
  • యాత్ర‌పై మాట్లాడ‌మంటే త‌న‌ను పొగ‌డుతారేమిట‌ని వంశీపై అస‌హ‌నం
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర త్వ‌ర‌లోనే తెలంగాణ‌లోకి ప్ర‌వేశించ‌నుంది. ఈ క్ర‌మంలో రాష్ట్రంలో రాహుల్ యాత్ర‌పై స‌మీక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్ గురువారం హైద‌రాబాద్ వ‌చ్చారు. గాంధీ భ‌వ‌న్‌లో తెలంగాణ కాంగ్రెస్ (టీపీసీసీ) నేత‌ల‌తో ఆయ‌న భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స‌హా టీ కాంగ్రెస్ నేత‌ల‌కు వేణుగోపాల్ క్లాస్ పీకారు.

భార‌త్ జోడో యాత్ర ప‌ట్ల తెలంగాణ‌లో పెద్ద‌గా ప్ర‌చార‌మే జ‌ర‌గ‌డం లేద‌ని వేణుగోపాల్ అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ప‌బ్లిసిటీలో అంద‌రికంటే ముందు ఉండే రేవంత్ రెడ్డి... జోడో యాత్ర ప‌బ్లిసిటీలో మాత్రం ఎందుకు వెనుక‌బ‌డ్డారంటూ నేరుగా రేవంత్‌నే ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇక‌నైనా జోడో యాత్ర ప్ర‌చారాన్ని పెంచాల‌ని ఆయ‌న రేవంత్‌కు సూచించారు. ఈ సంద‌ర్భంగా క‌ల‌గ‌జేసుకున్న మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి... యాత్ర‌లో స‌త్తా చాటుతున్నారంటూ వేణుగోపాల్‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. వంశీచంద్ రెడ్డి వ్యాఖ్య‌ల‌కు అడ్డు త‌గిలిన వేణుగోపాల్‌...యాత్ర గురించి మాట్లాడ‌మంటే త‌న‌ను పొగుడుతారేమిట‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.
Congress
Telangana
TPCC President
Revanth Reddy
KC Venugopal
Rahul Gandhi
Bharat Jodo Yatra
Vamshi Chand Reddy

More Telugu News