Abhiram: 'అహింస' నుంచి కమ్మగుంటదే పిల్లా సాంగ్ ప్రోమో రిలీజ్!

  • తేజ మరో ప్రేమకథగా 'అహింస'
  • హీరోగా అభిరామ్ పరిచయం 
  • హీరోయిన్ గీతికకి కూడా ఇదే ఫస్టు మూవీ 
  • సంగీత దర్శకుడిగా ఆర్పీ పట్నాయక్ రీ ఎంట్రీ 
  • పూర్తి పాట నాని చేతుల మీదుగా 15వ తేదీన విడుదల    
Ahimsa song promo released

రానా దగ్గుబాటి తమ్ముడు అభిరామ్ 'అహింస' సినిమాతో హీరోగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బలమైన .. విభిన్నమైన కథా చిత్రాలను అందిస్తుందనే మంచి పేరు ఈ బ్యానర్ కి ఉంది. అలాంటి ఈ బ్యానర్ పై రూపొందిన సినిమా ఇది. 

ఈ సినిమాలో అభిరామ్ జోడీగా గీతిక తివారి కథానాయికగా నటించగా, రజత్ బేడీ కీలకమైన పాత్రను పోషించింది. చాలా కాలంగా సంగీత దర్శకుడిగా దూరంగా ఉంటూ వచ్చిన ఆర్పీ పట్నాయక్ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి 'కమ్మగుంటదే పిల్లా' సాంగ్ ప్రోమోను వదిలారు.

గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. హీరో హీరోయిన్ పై చిత్రీకరించబడిన ఈ పాట బాగుంది. చంద్రబోస్ అందించిన సాహిత్యం ఆకట్టుకునేలా ఉంది. పూర్తి పాటను హీరో నాని చేతుల మీదుగా ఈ నెల 15వ తేదీన సాయంత్రం 4:05 నిమిషాలకు రిలీజ్ చేయించనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను వదిలారు.

More Telugu News