Sensex: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Markets ends in losses
  • 390 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 109 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 7 శాతానికి పైగా నష్టపోయిన విప్రో షేర్ విలువ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. అమెరికా ద్రవ్యోల్బణం డేటా విడుదల కానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. దీంతో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 390 పాయింట్లు కోల్పోయి 57,235కి పడిపోయింది. నిఫ్టీ 109 పాయింట్లు నష్టపోయి 17,014కి దిగజారింది. హెల్త్ కేర్, మెటల్ సూచీలు మినహా మిగిలిన అన్ని సూచీలు నష్టాలను మూటకట్టుకున్నాయి. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (3.19%), సన్ ఫార్మా (1.30%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (0.37%), డాక్టర్ రెడ్డీస్ (0.23%), అల్ట్రాటెక్ సిమెంట్ (0.08%). 

టాప్ లూజర్స్:
విప్రో (-7.03%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.36%), ఎల్ అండ్ టీ (-1.85%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.60%), ఏసియన్ పెయింట్స్ (-1.12%).

  • Loading...

More Telugu News