Madhya Pradesh: వాటేన్ ఐడియా!.. చేతిపంపు కొడితే నాటుసారా! వీడియో ఇదిగో

handpump gives illegal liquor in Madyapradesh watch video
  • మధ్యప్రదేశ్‌లో నాటుసారా మాఫియా పథకం
  • భూమిలో సారా డ్రమ్ములు అమర్చి పైన చేతిపంపు
  • గ్రామం మొత్తం నాటుసారా వ్యాపారులే
ఈ వార్త చదివిన తర్వాత ‘వాటేన్ ఐడియా’ అనకుండా ఉండలేరంటే అతిశయోక్తి కాదేమో. నాటుసారా మాఫియా తెలివికి ఇది నిలువెత్తు ఉదాహరణ. చేతిపంపు కొడితే అందులోంచి నాటుసారా రావడం చూసి పోలీసులు విస్తుపోయారు. మధ్యప్రదేశ్ గునా జిల్లాలోని భన్‌పుర అనే గ్రామంలోని నాటుసారా వ్యాపారులు చేసుకున్న ఏర్పాటు ఇది. నాటుసారా డ్రమ్ములను భూమిలో పాతిపెట్టిన వ్యాపారులు వాటిలో పైపులు పెట్టి నేలపైనున్న చేతిపంపునకు అమర్చారు. పంపును చేత్తో కొడితే డ్రమ్ము లోపలి నాటుసారా పైకి వచ్చేలా ఏర్పాటు చేశారు. 

ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ఈ ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ వ్యవహారం బయటపడిపోయింది. నాటుసారా మాఫియా తెలివిని చూసి పోలీసులు అవాక్కయ్యారు. నాటుసారా ఏరులై పారుతున్న ఈ గ్రామంపై దాడిచేసిన పోలీసులు ఈ సరికొత్త ఏర్పాటు చూసి నోరెళ్లబెట్టారు. గ్రామంలోని దాదాపు ప్రతి ఇంట్లోనూ నాటుసారా తయారుచేస్తున్నట్టు గుర్తించారు. డమ్ముల కొద్దీ నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. తయారీదారులపై కేసులు నమోదు చేశారు.
Madhya Pradesh
Illegal Liquor
Hand Pump
Guna District

More Telugu News