Andhra Pradesh: ఏపీలోని ఆర్బీకేల‌పై ప్ర‌శంస‌లు కురిపించిన ఇథియోపియా వ్య‌వ‌సాయ మంత్రి

ethiopia agriculture minister Meles Mekonen Yimer hails rbks in ap
  • ఏపీ ప‌ర్య‌ట‌న‌లో ఇథియోపియా వ్య‌వ‌సాయ మంత్రి మెలిస్‌
  • తాడేప‌ల్లిలో సీఎం జ‌గ‌న్‌తో భేటీ
  • ఆర్బీకేల్లోని డిజిట‌ల్ సొల్యూష‌న్స్‌పై స‌హ‌కారం అందించాల‌ని విజ్ఞ‌ప్తి
ఏపీలో వైసీపీ స‌ర్కారు కొత్త‌గా ప్ర‌వేశ‌పెట్టిన రైతు భ‌రోసా కేంద్రా(ఆర్బీకే)ల‌పై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. బుధ‌వారం ఏపీ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఇథియోపియా వ్య‌వ‌సాయ శాఖ మంత్రి మెలిస్ మెకోనెన్ యిమిర్ త‌న ప్ర‌తినిధి బృందంతో క‌లిసి తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో భేటీ అయ్యారు. 

ఈ సంద‌ర్భంగా ఆర్బీకేల‌ను ప్ర‌స్తావించిన మెలిస్‌... వాటి ప‌నితీరుపై ప్ర‌శంస‌లు కురిపించారు. ఆర్బీకేల‌ను ఏర్పాటు చేసే దిశ‌గా సాగిన జ‌గ‌న్ విజన్ త‌న‌ను అబ్బుర‌ప‌ర‌చింద‌ని ఆయ‌న అన్నారు. ఆర్బీకేల్లో వాడుతున్న డిజిట‌ల్ సొల్యూష‌న్స్‌పై త‌మ‌కు స‌హ‌కారం అందించాల‌ని ఆయ‌న సీఎం జ‌గ‌న్‌ను కోరారు. అందుకు ప్ర‌తిస్పందించిన జ‌గ‌న్‌...త‌ప్ప‌కుండా స‌హ‌కారం అందిస్తామ‌ని హామీ ఇచ్చారు.
Andhra Pradesh
YSRCP
YS Jagan
RBK
Ethiopia
Meles Mekonen Yimer

More Telugu News