ఇక తెలంగాణలోనే ఫ్రీడం ఆయిల్ తయారీ... రూ.400 కోట్లతో రిఫైనరీ ఏర్పాటుకు జెమిని ఎడిబుల్స్ నిర్ణయం
- కేటీఆర్‌ను కలిసిన జెమిని ఎడిబుల్స్ ప్రతినిధి
- సింగపూర్ సంస్థతో కలిసి తెలంగాణలో రిఫైనరీ ఏర్పాటు చేస్తామని ప్రతిపాదన
- జెమిని ఎడిబుల్స్ ప్రతిపాదనను స్వాగతించిన కేసీఆర్
- తెలంగాణ ఆయిల్ పామ్ రైతులకు మరింత మేలు జరుగుతుందని వ్యాఖ్య
ఈ ప్రతిపాదన ప్రకారం సింగపూర్‌కు చెందిన గోల్డెన్ అగ్రి ఇంటర్నేషనల్‌తో కలిసి సంయుక్తంగా రిఫైనరీని జెమిని ఎడిబుల్స్ ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ఆ సంస్థ రూ.400 కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది. ఈ రీఫైనరీతో ఫ్రీడం అయిల్ ఇకపై తెలంగాణలోనే తయారు కానుంది. జెమిని ఎడిబుల్స్ ప్రతిపాదనను స్వాగతించిన కేటీఆర్... జెమిని ఎడిబుల్స్ రిఫైనరీతో రాష్ట్రంలో ఎల్లో రివల్యూషన్లో తెలంగాణ మరో కీలక అడుగు వేసినట్టు అవుతుందని తెలిపారు. జెమిని ఎడిబుల్స్ రిఫైనరీతో రాష్ట్రానికి చెందిన అయిల్ పామ్ రైతులకు మరింత మేలు జరుగుతుందన్నారు.