అస్సలు తగ్గని పీఎస్1... రూ. 450 కోట్ల క్లబ్ దిశగా పయనం
- రెండు వారాలుగా కొనసాగుతున్న సినిమా ప్రభంజనం
- ఇప్పటికే 400 కోట్లు దాటిన వసూళ్లు
- జర్మనీలోనూ చిత్రానికి అద్భుత స్పందన
చిత్రం విడుదలైన రెండు వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్ల మార్క్‌ను అధిగమించింది. దాంతో, ఈ రెండు వారాల్లో వచ్చిన సినిమాల్లో పొన్నియన్ సెల్వన్ బాక్సాఫీస్ వద్ద స్పష్టమైన విజేతగా నిలిచింది. తొలి భాగానికి పెట్టిన పెట్టుబడులను చిత్ర నిర్మాతలు రికవరీ చేసినట్లు సమాచారం. రెండు పార్టులను దాదాపు ఒకే స్ట్రెచ్ లో చిత్రీకరించారు. ఈ లెక్కన రెండో పార్టుకు వచ్చే వసూళ్లతో నిర్మాతలకు లాభాల పంట పడనుంది.
మరోవైపు ఈ చిత్రానికి జర్మనీలోనూ అద్భుత స్పందన వస్తోందని ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాల తెలిపారు. జర్మనీ బాక్స్ ఆఫీస్ వద్ద పది రోజుల్లో నిర్దేశిత థియేటర్లలో ఈ చిత్రం 1.25 కోట్ల వసూళ్లు రాబట్టిందని ట్వీట్ చేశారు. ఈ సినిమా రెండో భాగం ఆరు నుంచి తొమ్మిది నెలల్లో థియేటర్లలోకి రానుంది.