Redmi Writing Pad: రూ. 599కే రెడ్ మీ నోట్ ప్యాడ్

Redmi Writing Pad Rs 599 digital slate for note taking doodling check features
  • ఎలక్ట్రో ఫొరెటిక్ అనే ప్రత్యేకమైన డిస్ ప్లే
  • ఇది ఒక రకంగా డిజిటల్ స్లేట్
  • స్కూల్ పిల్లలకు ఎక్కువగా ఉపయోగం
  • షావోమీ వెబ్ సైట్ లో విక్రయాలు
చైనాకు చెందిన షావోమీ కంపెనీ ఊహించని ఓ ఉత్పత్తిని రెడ్ మీ ప్యాడ్ పేరుతో భారత వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. రెడ్ మీ రైటింగ్ ప్యాడ్ ధర కేవలం రూ.599. దీన్ని అన్ని వయసుల వారు ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా చిన్నారులకు ఇది ఎంతో ఉపయోగపడనుంది. 

8.5 అంగుళాల ఎల్ సీడీ స్క్రీన్ తో కూడిన రెడ్ మీ ప్యాడ్ తోపాటు స్టైలస్ కూడా వస్తుంది. దీని సాయంతో ఈ ప్యాడ్ పై రాసుకోవడం, డిజైన్లు వేసుకోవడం చేసుకోవచ్చు. ఒక విధంగా ఇది డిజిటల్ స్లేట్ వంటిది. స్క్రీన్ నుంచి ఎటువంటి లైటింగ్ విడుదల కాదు. ఏబీఎస్ మెటీరియల్ తో కూడిన దీని బరువు 90 గ్రాములు.

ఎలక్ట్రో ఫొరెటిక్ అనే ప్రత్యేకమైన డిస్ ప్లేను ఈ ప్యాడ్ లో రెడ్ మీ ఏర్పాటు చేసింది. ఇది రంగులు మారుతుంటుంది. ప్యాడ్ తో పాటు వచ్చే బ్యాటరీ 20,000 పేజీలకు సపోర్ట్ చేస్తుంది. అంటే 20,000 పేజీల మ్యాటర్ రాసుకుని డిలీట్ చేసుకునేందుకు సరిపడా ఈ బ్యాటరీ వస్తుంది. తర్వాత తిరిగి బ్యాటరీని రీచార్జ్ చేసుకోవచ్చు. స్క్రీన్ పై రాసినది చెరిపేసేందుకు వీలుగా ఆరెంజ్ కలర్ బటన్ ఉంటుంది. కేవలం బ్లాక్ కలర్ తో ఉండే ఈ ప్యాడ్ ను షావోమీ వెబ్ సైట్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చు.
Redmi Writing Pad
Rs 599
digital slate
features

More Telugu News