వానలో వలపుల సందడి : 'ఓరి దేవుడా' నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్
- విష్వక్ సేన్ హీరోగా నిర్మితమైన 'ఓరి దేవుడా'
- డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన సినిమా
- ప్రత్యేకమైన పాత్రలో వెంకటేశ్
- ఈ నెల 21వ తేదీన సినిమా విడుదల
కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. 'ఇడువనే ఇడువనే క్షణం కూడా నిన్నే బుజ్జమ్మా బుజ్జమ్మా .. మరువనే మరువనే కలల్లోను నిన్నే బుజ్జమ్మా బుజ్జమ్మా' అంటూ ఈ పాట సాగుతోంది. హీరో ... హీరోయిన్లపై చిత్రీకరించిన పాట ఇది. లీన్ జేమ్స్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు.
కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను అనిరుద్ ఆలపించాడు. బీట్ పరంగా ఈ పాట యూత్ ను ఆకట్టుకునేలా ఉంది. సతీశ్ కృష్ణన్ కంపోజ్ చేసిన కొరియోగ్రఫీ కూడా బాగుంది. ఈ నెల 21వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందనేది చూడాలి.