Revanth Reddy: ఇలాంటి చర్యలతో మునుగోడులో కాంగ్రెస్ గెలుపును అడ్డుకోలేరు: రేవంత్ రెడ్డి

Congress will win in Munugode says Revanth Reddy
  • చండూర్ లో కాంగ్రెస్ కార్యాలయాన్ని దగ్ధం చేసిన ఘటనపై రేవంత్ ఆగ్రహం
  • కాంగ్రెస్ కు వస్తున్న ఆదరణను చూడలేకే ఇలా చేస్తున్నారని మండిపాటు
  • బాధ్యులను 24 గంటల్లో అరెస్ట్ చేయాలని డిమాండ్
మునుగోడు నియోజవర్గంలోని చండూర్ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని దగ్ధం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయాలను తగులబెట్టినా, దిమ్మెలను కూల్చినా మునుగోడులో ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని అన్నారు. ఇలాంటి చర్యలతో కాంగ్రెస్ గెలుపును అడ్డుకోలేరని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేకే ఇలాంటి పనులు చేస్తున్నారని అన్నారు.

 టీఆర్ఎస్, బీజేపీ కేడర్ కుమ్మక్కై తమ కేడర్ ను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని 24 గంటల్లో అరెస్ట్ చేయాలని... లేనిపక్షంలో జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు తాను ధర్నా చేస్తానని అన్నారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలను చేపడతామని చెప్పారు.
Revanth Reddy
Congress
Munugode

More Telugu News