5g speed: 5జీ డేటా స్పీడ్ లో దుమ్ము దులిపిన జియో

India 5G test download speeds hit 500 mbps Ookla  Read
  • 598.58 ఎంబీపీఎస్ డౌన్ లోడ్ వేగం నమోదు
  • ఎయిర్ టెల్ నెట్ వర్క్ లో వేగం 197.98 ఎంబీపీఎస్
  • నాలుగు పట్టణాల్లో నెట్ వర్క్ సామర్థ్యంపై ఊక్లా పరీక్ష
5జీ వేగంలో రిలయన్స్ జియో అగ్ర స్థానంలో నిలిచింది. పోటీ సంస్థలకు అందనంత ఎత్తులో నిలిచింది. 5జీ డేటా వేగం గణాంకాలను ఇంటర్నెట్ టెస్టింగ్ సంస్థ ఊక్లా విడుదల చేసింది. రిలయన్స్ జియో 598.58 ఎంబీపీఎస్ డౌన్ లోడింగ్ వేగాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత పోటీ సంస్థ భారతీ ఎయిర్ టెల్ నెట్ వర్క్ డౌన్ లోడ్ వేగం 197.98 ఎంబీపీఎస్ గా ఉంది. ఢిల్లీ, కోల్ కతా, ముంబై, వారణాసి ప్రాంతాల్లో జూన్ నుంచి ఈ పరీక్ష నిర్వహించారు.

అక్టోబర్ 1న 5జీ సేవలు మొదలు కాగా, దీనికంటే ముందే టెలికం ఆపరేటర్లు తమ నెట్ వర్క్ లను పరీక్షించినట్టు ఊక్లా తెలిపింది. ఆ సమయంలో 16.27 ఎంబీపీఎస్ నుంచి 809.94 ఎంబీపీఎస్ వరకు వేగం నమోదు అయినట్టు వెల్లడించింది. దీని ఆధారంగా చూస్తే టెలికం కంపెనీలు తమ నెట్ వర్క్ లను రీక్యాలిబరేట్ ( మార్పులు) చేస్తున్నట్టు తెలుస్తోందని ఊక్లా తెలిపింది. పట్టణాల వారీగానూ టెలికం నెట్ వర్క్ ల 5జీ డౌన్ లోడ్ లో వ్యత్యాసాలు ఉన్నాయి.
5g speed
telecom
operators
jio top
Ookla Read

More Telugu News