Sri Lanka: సముద్రంలో 13 కిలోమీటర్లు ఈది తమిళనాడు చేరుకున్న శ్రీలంక యువకుడు.. తీరం చేరగానే అరెస్ట్

Sri Lanka man swims in sea 13 kilometers to reach Rameshwaram
  • శ్రీలంకలోని తలైమన్నార్ నుంచి భార్య, ముగ్గురు పిల్లలతో  కలిసి బోటులో వచ్చిన యువకుడు
  • తీరానికి చేరుకోవడానికి ముందు సముద్రంలో దూకేసిన యువకుడు
  • 13 కిలోమీటర్లు ఈది రామేశ్వరం తీరానికి చేరుకున్న యువకుడు 
  • అందరినీ మండపం క్యాంపునకు పంపిన అధికారులు
శ్రీలంకకు చెందిన ఓ యువకుడు సముద్రంలో దూకి 13 కిలోమీటర్లు ఈదుకుంటూ మొత్తానికి తమిళనాడు తీరానికి చేరుకున్నాడు. అతడి సాహసానికి, గుండె ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే. కానీ, అతడు అక్రమంగా భారత్‌లో ప్రవేశించడంతో తీర గస్తీదళాలు అతడిని అదుపులోకి తీసుకున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే.. శ్రీలంక నుంచి ఓ యువకుడు తన కుటుంబంతో కలిసి ఓ పడవలో తమిళనాడుకు బయలుదేరాడు. 

తమిళనాడు తీరానికి చేరుకునే క్రమంలో సముద్రంలో దూకేసిన 24 ఏళ్ల ఆ యువకుడు ఆ తర్వాత 13 కిలోమీటర్లు ఈది రామేశ్వరం తీరానికి చేరుకున్నాడు. ఆదివారం అతడిని అదుపులోకి తీసుకున్న కోస్ట్ గార్డ్ అధికారులు అతడి నుంచి గడువు ముగిసిన పాస్‌పోర్టును స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు. శ్రీలంకలోని తలైమన్నారుకు చెందిన హసాన్ ఖాన్ అలియాస్ అజయ్ అలియాస్ ఖాన్ భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి బోటులో వచ్చినట్టు గుర్తించారు. వారితో పాటు మరో వ్యక్తి కూడా వచ్చాడని, అందరినీ రామనాథపురం జిల్లా మండపం క్యాంపునకు తరలించినట్టు చెప్పారు.
Sri Lanka
Tamil Nadu
Rameshwaram

More Telugu News