Komatireddy Raj Gopal Reddy: కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ఆస్తుల వివ‌రాలివే!

komatireddy raj gopal reddy reveals his assets in affidavit
  • మునుగోడు ఉప ఎన్నిక‌లో నామినేష‌న్ వేసిన రాజ‌గోపాల్ రెడ్డి
  • త‌న ఆస్తుల‌ను అఫిడ‌విట్ రూపంలో వెల్ల‌డించిన వైనం
  • కోమ‌టిరెడ్డి మొత్తం ఆస్తుల విలువ రూ.222.67 కోట్లు
  • త‌న స‌తీమ‌ణి పేరిట రూ.52.44 కోట్ల ఆస్తులున్న‌ట్లు వెల్ల‌డి
మునుగోడు ఉప ఎన్నిక‌కు కార‌ణ‌మైన మాజీ ఎమ్మెల్యే, ప్ర‌స్తుతం మునుగోడు ఉప ఎన్నిక‌లో బీజేపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి సోమ‌వారం నామినేష‌న్ దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. నామినేష‌న్‌లో భాగంగా ఆయ‌న త‌న ఆస్తుల వివ‌రాల‌ను అఫిడ‌విట్ రూపంలో జ‌త చేశారు. ఈ అఫిడ‌విట్ ప్ర‌కారం కోమ‌టిరెడ్డి ఆస్తుల విలువ రూ.222.67 కోట్లుగా తేలింది.

కోమ‌టిరెడ్డి త‌న‌కు రూ.61.5 కోట్లు అప్పులుగా ఉన్న‌ట్లుగా కూడా వెల్ల‌డించారు. కోమ‌టిరెడ్డి ఆస్తుల్లో స్థిరాస్తుల విలువ రూ.152.69 కోట్లు కాగా...చ‌రాస్తుల విలువ రూ.69.97 కోట్లుగా ఆయ‌న‌ పేర్కొన్నారు. త‌న స‌తీమ‌ణి ఆస్తుల విలువ రూ.52.44 కోట్లుగా కోమ‌టిరెడ్డి వెల్ల‌డించారు.
Komatireddy Raj Gopal Reddy
Munugode
BJP

More Telugu News