రేపు ములాయం అంత్యక్రియలు... హాజరుకానున్న తెలంగాణ సీఎం కేసీఆర్
- ములాయం అస్తమయం
- రేపు స్వస్థలం సైఫాయ్ లో అంత్యక్రియలు
- నివాళులు అర్పించనున్న కేసీఆర్
అంతకుముందు, ములాయం మరణం పట్ల కేసీఆర్ స్పందించారు. ములాయం కుమారుడు అఖిలేశ్ యాదవ్, ఇతర కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ములాయం దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం యూపీకి మూడుసార్లు సీఎంగా పనిచేశారని, కేంద్రమంత్రిగానూ పనిచేశారని వెల్లడించారు.
సోషలిస్టు నేత రామ్ మనోహర్ లోహియా, స్వాతంత్ర సమరయోధుడు రాజ్ నారాయణ్ వంటి గొప్పనేతల స్ఫూర్తితో ములాయం రాజకీయాల్లోకి వచ్చారని, తన జీవితకాలం పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడ్డారని కేసీఆర్ కొనియాడారు.