Gali Janardan Reddy: గాలి జనార్ధనరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

  • అక్రమ మైనింగ్ కేసులో జనార్దన్ రెడ్డిపై అభియోగాలు
  • సీబీఐ విచారణ
  • బెయిల్ నిబంధనలు సడలించాలన్న గాలి
  • పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీం
Supreme Court dismisses Gali Janardan Reddy petition

అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. బెయిల్ నిబంధనలు సడలించాలంటూ గాలి జనార్దన్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం ఆ పిటిషన్ ను కొట్టివేసింది. 

ఈ కేసులో ట్రయల్ మొదలుపెట్టాలని హైదరాబాదు సీబీఐ కోర్టును అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇకనుంచి రోజువారీ విచారణ చేపట్టాలని, 6 నెలల్లో విచారణ పూర్తి చేయాలని తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. కాగా, గాలి జనార్దన్ రెడ్డి బళ్లారిలో నెల రోజులే ఉండేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణ మురారి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

More Telugu News