Rashmika Mandanna: రష్మిక, విజయ్ చెప్పట్లేదు.. దాచేస్తున్నారు?

Rashmika Mandanna borrows Vijay Deverakonda sunglasses for pic from Maldives
  • మాల్దీవుల అందాలను ఆస్వాదిస్తున్న జంట
  • విజయ్ చలువ కళ్లద్దాలతో కనిపించిన రష్మిక
  • స్విమ్మింగ్ పూల్ ఒడ్డున కూర్చుని దిగిన ఫొటో
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ప్రస్తుతం మాల్దీవుల్లో విహరిస్తున్నారు. శుక్రవారం వీరు ముంబై విమానాశ్రయంలో ఒకరి తర్వాత ఒకరు ఐదు నిమిషాల వ్యవధిలో కెమెరాల కంటపడడం తెలిసిందే. వీరు మాల్దీవులకు వెళ్లినట్టు అప్పుడు చూచాయిగా తెలిసినా, అక్కడి చిత్రాలను చూస్తుంటే ఇప్పుడు నిజమేనని తెలుస్తోంది. శనివారం రష్మిక తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో ఒక ఫొటోను పోస్ట్ చేసింది. అందులో ఆమె స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఒంటరిగా  కూర్చుని కనిపిస్తోంది. కాకపోతే ఆమె కళ్లజోడును పరిశీలించి చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. 

రష్మిక ధరించిన చలువ కళ్లద్దాలు విజయ్ దేవరకొండవి కావడం గమనించాలి. గతంలో విజయ్ ఇవే కళ్లద్దాలతో కనిపించాడు. ఇద్దరూ కలసి మాల్దీవులకు ఒకేసారి వెళ్లినట్టు కనిపించకుండా ఐదు నిమిషాల వ్యవధిలో జాగ్రత్తపడ్డారు. మాల్దీవులకు వెళ్లి అక్కడి అందాలను ఆస్వాదిస్తున్నారు. కానీ, ఈ చిన్న కళ్లద్దాలు వాళ్లిద్దరినీ పట్టించేశాయి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారని రకరకాల ప్రచారాలు వ్యాప్తిలో ఉన్నాయి. వాటిని వీరు ఖండించలేదు. అలాగని ధ్రువీకరించలేదు. మరి నిజమేంటో ఆ నల్ల కళ్లద్దాలకే తెలియాలి మరి. 




Rashmika Mandanna
wears
Vijay Deverakonda
sunglasses
Maldives

More Telugu News