NTV: కోటి దీపోత్సవానికి సర్వం సిద్ధం.. ఎన్టీఆర్ స్టేడియం ఇక నిత్య కైలాసమే!

  • ఈ నెల 31న కోటి దీపోత్సవం ప్రారంభం
  • 15 రోజులపాటు కన్నుల పండువగా సాగనున్న వైనం
  • ప్రతి రోజూ లక్షలాదిమంది హాజరు
  • భక్తులను సాదరంగా ఆహ్వానిస్తున్న ఎన్టీవీ, భక్తి టీవీ
Bhakti TV Koti Deepotsavam starts from October 1st

ప్రముఖ టీవీ చానళ్లు ఎన్టీవీ, భక్తి టీవీ నిర్వహించే కోటి దీపోత్సవానికి రంగం సిద్ధమైంది. దశాబ్దకాలంగా నిర్వహిస్తున్న ఈ కోటి దీపోత్సవం ఈ ఏడాది 11వ వసంతంలోకి అడుగుపెడుతోంది. దేదీప్యమానంగా వెలిగే దీపపు కాంతులు, ప్రచానామృతాలు, కళ్యాణ కమనీయాలతో భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తే కోటి దీపోత్సవం ఈ నెల 31న ప్రారంభమై నవంబరు 14వ తేదీ వరకు కొనసాగుతుంది. ఎప్పటిలానే ఇందుకు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదిక కానుంది. 15 రోజులపాటు జరిగే ఈ మహా వైభవం కార్తీక మాసంలో కదిలి వచ్చిన కైలాసాన్ని తలపిస్తుంది.

శివకేశవులని ఒకేవేదికపై కోటీదీపాల మధ్య దర్శించుకునే యోగమే కోటి దీపోత్సవం. జనం గుండె లోతుల్లో దాగిన భక్తిభావాలను ఒక్క వేదిక మీదకు తెచ్చే పవిత్రప్రయోగమే ఈ కోటిదీపోత్సవంగా చెబుతారు. ప్రతి రోజు లక్షలాదిమంది భక్తులతో కిక్కిరిసిపోతూ ఉంటుంది. ప్రవచనాలతో మొదలై, ప్రత్యేక అర్చనలతో పవిత్రత సంతరించుకుని, దేవదేవుల కళ్యాణ మహోత్సవాలు, లింగోద్భవం, నీరాజనాలతో భక్తులకు నిండైన ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రతిరోజూ పంచుతుంది. దేశం నలుమూలల నుంచి పీఠాధిపతులు, మహాయోగులు, ఆధ్యాత్మికవేత్తల సందేశాలతో కోటిదీపోత్సవ వేదిక ఒక ఆధ్యాత్మిక దివ్యఅనుభూతికి నిలయంగా మారుతుంది. కోటి దీపోత్సవం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ కార్తీక మాసంలో శివకేశవుల సాక్షిగా సాగే కోటిదీపార్చన మహోత్సవంలో భక్తులందరూ భాగస్వాములు కావాలని ఎన్టీవీ భక్తిటీవీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తోంది.

More Telugu News