Uniform: భారత వాయుసేన సిబ్బందికి కొత్త యూనిఫాం

  • ఐఏఎఫ్ రైజింగ్ డే సందర్భంగా విడుదల
  • ఆర్మీ యూనిఫాంను పోలి ఉన్న సరికొత్త యూనిఫాం
  • నిఫ్ట్ సాయంతో రూపొందించిన వాయుసేన స్టాండింగ్ డ్రెస్ కమిటీ
New uniform for Indian Air Force personnel

ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా తట్టుకునే కొత్త యూనిఫాంను భారత వాయుసేన స్టాడింగ్ డ్రెస్ కమిటీ, నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) సంయుక్తంగా రూపొందించాయి. ఈ సరికొత్త యూనిఫాంను భారత వాయుసేన సిబ్బందికి అందించనున్నారు. 

మైదానం, ఎడారి, పర్వత ప్రాంతాలు, అడవులు... ఇలా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎలాంటి వాతావరణంలోనైనా ఈ యూనిఫాం ధరిస్తే సౌకర్యవంతంగా ఉంటుందని భారత వాయుసేన చెబుతోంది. భారత వాయుసేన 90వ రైజింగ్ డే ఉత్సవాల సందర్భంగా ఈ యూనిఫాంను అధికారికంగా విడుదల చేశారు. 

గతంలో వాయుసేన సిబ్బంది ఉపయోగించిన యూనిఫాంకు ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ కొత్త యూనిఫాం చాలావరకు ఆర్మీ యూనిఫాంను పోలి ఉంటుంది. దీన్ని తేలికపాటి ఫ్యాబ్రిక్ తో రూపొందించారు. 

ఈ సరికొత్త యూనిఫాం కిట్ లో కంబాట్ టీషర్టు, ఫీల్డ్ స్కేల్ డిస్రప్టివ్ టోపీ, కంబాట్ బోనీ హ్యాట్, డిస్రప్టివ్ వెబ్ బెల్ట్, యాంక్లెట్ కంబాట్ షూ, మ్యాచింగ్ టర్బన్ పొందుపరిచారు.

More Telugu News