Adipurush Movie: టీజర్ ను చూసి ఒక అంచనాకు రావద్దు.. ఎవరినీ నిరాశ పరచను: 'ఆదిపురుష్' దర్శకుడు ఓం రౌత్

Prabhas Adipurush will satisfy everyone says director Om Raut
  • ఇటీవల విడుదలైన 'ఆదిపురుష్'
  • టీజర్ ను చూసి నిరాశకు గురవుతున్న ఫ్యాన్స్
  • సినిమా అందరినీ అలరిస్తుందన్న ఓం రౌత్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజా చిత్రం 'ఆదిపురుష్' టీజర్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ టీజర్ ను చూసిన చాలా మంది పెదవి విరిచారు. ముఖ్యంగా రావణుడి గెటప్ ను చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర దర్శకుడు ఓం రౌత్ స్పందించారు. టీజర్ లో కేవలం పాత్రలను మాత్రమే పరిచయం చేశామని.. చిన్ని వీడియోను చూసి ఒక అంచనాకు రావద్దని అన్నారు. 

వచ్చే ఏడాది జనవరి 12న సినిమా విడుదల అవుతుందని... సినిమా చూసిన వారెవరూ నిరాశ చెందరని చెప్పారు. ఈ సినిమా ప్రతి ఒక్కరినీ అలరిస్తుందని అన్నారు. ప్రభాస్ కోసమే రాముడి పాత్రను రాశానని... కథ రాస్తున్నంత సేపు తన మైండ్ లో ప్రభాసే ఉన్నాడని చెప్పారు. ప్రభాస్ కోసం ఈ సినిమాను తెరకెక్కించానని.. ప్రభాస్ నో చెప్పి ఉంటే సినిమా చేసే వాడిని కాదని అన్నారు. ప్రభాస్ నటన అద్భుతంగా ఉందని చెప్పారు.
Adipurush Movie
Om Raut
Prabhas
Tollywood
Bollywood

More Telugu News