Chiranjeevi: హీరోగా తెలుగులో మా అబ్బాయికి ఛాన్స్ రాకపోవడమే బాధగా ఉంది: ఎడిటర్ మోహన్

  • నిర్మాతగా భారీ హిట్లు ఇచ్చిన ఎడిటర్ మోహన్ 
  • 'గాడ్ ఫాదర్' తో పెద్దబ్బాయికి హిట్ పడిందంటూ వ్యాఖ్య 
  • చిన్నబ్బాయిని హీరోగా టాలీవుడ్ కి తీసుకురావాలని ఉందంటూ వెల్లడి  
  •  జయంరవికి 'పొన్నియిన్ సెల్వన్'తో హిట్ పడటం పట్ల హర్షం
Editor Mohan Interview

ఎడిటర్ మోహన్ పేరు వినగానే తెలుగులో ఆయన నిర్మించిన 'హనుమాన్ జంక్షన్' .. 'హిట్లర్' .. 'బావా బావమరిది' .. 'మామగారు' వంటి సినిమాలు గుర్తుకు వస్తాయి. అవి సాధించిన విజయాలు కళ్లముందు కదలాడతాయి. ఆయన కుమారులే దర్శకుడు మోహన్ రాజా - హీరో జయం రవి. తన తనయులిద్దరి గురించి తాజా ఇంటర్వ్యూలో ఆయన ప్రస్తావించారు. 

"చాలా కాలం క్రితం నేను చిరంజీవిగారితో 'హిట్లర్' సినిమాను నిర్మించాను. మళ్లీ ఇంతకాలానికి చిరంజీవిగారితో మా అబ్బాయి 'గాడ్ ఫాదర్' చేయడం .. అది పెద్ద హిట్ కావడం నాకు సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ సినిమా చూసిన చిరంజీవిగారు, మోహన్ రాజాకి దిష్టి తీయండి అన్నారు. మా అబ్బాయిపై నాకంటే చిరంజీవిగారికే ఎక్కువ ప్రేమ. 

తెలుగులో మోహన్ రాజాకి వచ్చిన గుర్తింపు సంతృప్తిని ఇస్తోంది. ఇక చిన్నబ్బాయి రవిని హీరోగా తెలుగులో పరిచయం చేయాలనుంది. ఆ సమయం కోసమే ఎదురుచూస్తున్నాను. 'పొన్నియిన్ సెల్వన్' గా తన నటన చూసి రజనీకాంత్ .. భాగ్యరాజాతో పాటు చాలామంది అభినందిస్తున్నారు. ఒక తండ్రికి ఇంతకంటే ఆనందం ఏముంటుంది?" అంటూ చెప్పుకొచ్చారు.

More Telugu News