Bigg Boss Telugu Season 6: బిగ్ బాస్ 6కు లభించని ప్రేక్షకాదరణ... దారుణంగా ఉన్న టీఆర్పీ రేటింగ్స్!

Telugu Big Boss TRP ratings
  • ప్రేక్షకులను మెప్పించలేకపోతున్న బిగ్ బాస్ 6
  • షోలో కనిపించని పేరున్న సెలబ్రిటీలు
  • క్రికెట్ మ్యాచ్ ఉన్న రోజుల్లో బిగ్ బాస్ పరిస్థితి మరింత దారుణం
బిగ్ బాస్ రియాల్టీ షో క్రమంగా ఆదరణ కోల్పోతోందా? టీఆర్పీ రేటింగ్స్ చూస్తే నిజమే అనిపిస్తోంది. ఒకప్పుడు బుల్లి తెరపై ఊపు ఊపిన బిగ్ బాస్... ఇప్పుడు దారుణంగా పర్ఫామ్ చేస్తోందని రేటింగ్స్ చెపుతున్నాయి. ఏ సీజన్ లో లేనంతగా తక్కువ రేటింగ్స్ వస్తున్నాయి. ఈ షో చూస్తున్న వారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. హౌస్ నుంచి ఎవరు వెళ్లిపోతున్నారే విషయం ముందుగానే తెలిసి పోతుండటం కూడా ఈ షోపై ఆసక్తిని సన్నిగిల్లేలా చేస్తోందని చెపుతున్నారు. ఈ సీజన్ లో పేరున్న సెలబ్రిటీలు ఎవరూ లేరు. దీంతో ఈ రియాల్టీ షో గ్లామర్ ని కోల్పోయిందని చెప్పుకోవచ్చు. ఈ షో రేటింగ్స్ దారుణంగా ఉన్నాయి. మరోవైపు, క్రికెట్ మ్యాచ్ ఉంటున్న రోజుల్లో షో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 

బిగ్ బాస్ తొలి వారం టీఆర్పీ రేట్లను మనం చూసినట్టయితే విషయం అర్థమవుతుంది. సీజన్ 1 - 16.18 టీఆర్పీ రేటింగ్, సీజన్ 2 - 15.05, సీజన్ 3 - 17.90, సీజన్ 4 - 18.50, సీజన్ 5 - 15.70, సీజన్ 6 - 8.86 గా ఉన్నాయి. ఈ గణాంకాలు చూస్తే బిగ్ బాస్ ప్రస్తుత సీజన్ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Bigg Boss Telugu Season 6
TRP

More Telugu News