Munugode: ఈ నెల 10న మునుగోడులో నామినేష‌న్ వేస్తా: కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి

komatireddy rajagopal reddy will file his nomination for munugode bypoll eo 10th of this month
  • మునుగోడు ఉప ఎన్నిక‌కు జారీ అయిన నోటిఫికేష‌న్‌
  • ఈ నెల 14 వ‌ర‌కు నామినేష‌న్ల దాఖ‌లుకు అవ‌కాశం
  • జైలుకు వెళ్లేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉండాల‌న్న కోమ‌టిరెడ్డి
న‌ల్ల‌గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నికల్లో ఈ నెల 10న నామినేష‌న్ దాఖ‌లు చేయ‌నున్న‌ట్లు బీజేపీ అభ్య‌ర్థిగా ఎంపికైన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ప్ర‌క‌టించారు. కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ టికెట్ ద్వారా ద‌క్కిన ఎమ్మెల్యే ప‌ద‌వికి కోమ‌టిరెడ్డి రాజీనామా చేయ‌డంతోనే మునుగోడుకు ఉప ఎన్నిక జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. శుక్ర‌వారం ఉప ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ జారీ కాగా... శుక్ర‌వారం నుంచి ఈ నెల 14 దాకా నామినేష‌న్ల దాఖ‌లుకు గ‌డువు ఉంది.

ఈ క్ర‌మంలో త‌న నామినేష‌న్ దాఖ‌లుకు సంబంధించి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి శుక్ర‌వారం ఓ ప్ర‌క‌ట‌న చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న అధికార టీఆర్ఎస్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. జైలుకు వెళ్లేందుకు కేసీఆర్ కుటుంబం సిద్ధంగా ఉండాల‌ని ఆయ‌న అన్నారు. ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణంలో క‌విత పాత్ర రుజువైంద‌ని ఆయ‌న చెప్పారు. కేసీఆర్ ప‌త‌నం మునుగోడు ఉప ఎన్నిక‌ల‌తోనే మొద‌లు కానుంద‌ని ఆయ‌న చెప్పారు. ఈ కార‌ణంగానే మునుగోడు ఉప ఎన్నిక అంటేనే కేసీఆర్ భ‌య‌ప‌డిపోతున్నార‌ని కోమ‌టిరెడ్డి వ్యాఖ్యానించారు.
Munugode
BJP
Komatireddy Raj Gopal Reddy
KCR
Telangana
Nalgonda District

More Telugu News