Indian Prisoners: పాకిస్థాన్ జైళ్లలో మృత్యువాత పడుతున్న భారత ఖైదీలు... కేంద్రం ఆందోళన

Indian prisoners deaths in Pakistan jails raises alarming situation
  • గత 9 నెలల కాలంలో ఆరుగురి మృతి
  • తరచుగా భారత మత్స్యకారులను అదుపులోకి తీసుకుంటున్న పాక్
  • శిక్షాకాలం పూర్తయినా నిర్బంధంలో ఉంచుతోందన్న పాక్ 
వివిధ కారణాలతో పెద్ద సంఖ్యలో భారతీయులు పాకిస్థాన్ జైళ్లలో మగ్గుతున్నారు. అయితే, ఇటీవలకాలంలో పాక్ జైళ్లలో భారత ఖైదీల మరణాల సంఖ్య పెరిగింది. ఈ పరిణామాల పట్ల కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. 

దీనిపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్ బాగ్చి స్పందించారు. భారత ఖైదీల భద్రత పట్ల పాకిస్థాన్ నిబద్ధతతో వ్యవహరించాలని కోరారు. గత 9 నెలల వ్యవధిలో ఆరుగురు భారత ఖైదీలు పాక్ జైళ్లలో మృత్యువాత పడ్డారని, వారిలో ఐదుగురు మత్స్యకారులని బాగ్చి వెల్లడించారు. వారు తమ శిక్షాకాలం పూర్తి చేసుకున్నప్పటికీ, పాకిస్థాన్ అధికారులు వారిని అక్రమంగా నిర్బంధంలో ఉంచారని, ఆ సమయంలోనే వారు చనిపోయారని ఆరోపించారు. 

తమ సముద్ర జలాల్లో ప్రవేశించారన్న ఆరోపణలతో భారత మత్స్యకారులను పాకిస్థాన్ బలగాలు తరచుగా అదుపులోకి తీసుకుంటుండడం తెలిసిందే. తాజాగా, మునిగిపోతున్న పడవ నుంచి ఆరుగురు భారత జాలర్లను కాపాడామని పాకిస్థాన్ పేర్కొంది.
Indian Prisoners
Deaths
Pakistan
Jail
India
Fishermen

More Telugu News