CJI: తదుపరి సీజేఐ ఎవరో చెప్పండి: సీజేఐ యూయూ లలిత్ కు కేంద్ర న్యాయశాఖ లేఖ

  • నవంబర్ 8న ముగియనున్న సీజేఐ లలిత్ పదవీకాలం
  • సీనియార్టీ ప్రకారం సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్ బాధ్యతలు చేపట్టే అవకాశం
  • జస్టిస్ చంద్రచూడ్ పేరును సీజేఐ లలిత్ ప్రతిపాదించే అవకాశం
Law minister writes letter to CJI Lalit requesting to propose next CJIs name

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్ పదవీ కాలం నవంబర్ 8న ముగియనుంది. ఆయన ఆరోజు రిటైర్ కాబోతున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి సీజేఐగా ఎవరిని నియమిస్తారో చెప్పాలంటూ జస్టిస్ లలిత్ కు కేంద్ర న్యాయశాఖ లేఖ రాసింది. కేంద్ర న్యాయమంత్రి కిరణ్ రిజిజు లేఖ రాశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 (2) ప్రకారం సీజేఐ నియామకం జరుగుతుంది. 

సీనియార్టీ ప్రకారం జస్టిస్ డీవై చంద్రచూడ్ తదుపరి సీజేఐగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. జస్టిస్ యూయూ లలిత్ తర్వాత ఈయనే సీనియర్. దీంతో, జస్టిస్ చంద్రచూడ్ పేరును సీజేఐ ప్రతిపాదించే అవకాశం ఉంది. ఒకవేళ సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్ బాధ్యతలను చేపడితే రెండేళ్ల పాటు ఆయన ఆ పదవిలో ఉంటారు. 2024 నవంబర్ 10న ఆయన రిటైర్ అవుతారు.

More Telugu News