5 లక్షల విమాన టికెట్లను ఉచితంగా అందిస్తున్న హాంకాంగ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

5 లక్షల విమాన టికెట్లను ఉచితంగా అందిస్తున్న హాంకాంగ్

Hong Kong will issue 5 lakhs free air tickets to tourists
  • కరోనా సంక్షోభంతో ప్రపంచ పర్యాటకం కుదేల్
  • మళ్లీ పుంజుకునేందుకు హాంకాంగ్ ప్రయత్నాలు
  • రూ.2 వేల కోట్లతో విమాన టికెట్ల కొనుగోలు
  • దేశీయ విమాన సంస్థలకు ఊతం
కొవిడ్ సంక్షోభం వల్ల దారుణంగా దెబ్బతిన్న రంగాల్లో పర్యాటకం ఒకటి. టూరిజంపై వచ్చే ఆదాయమే ప్రధాన ఆర్థిక వనరుగా ఉన్న అనేక దేశాలు కరోనా మహమ్మారి కొట్టిన దెబ్బకు కుదేలయ్యాయి. శ్రీలంక వంటి పేద దేశాలు తీవ్ర సంక్షోభంలో చిక్కుకోవడం దీని ప్రభావమే. 

అయితే, హాంకాంగ్, సింగపూర్ వంటి పలు దేశాలు మాత్రం క్రమంగా నిలదొక్కుకుంటున్నాయి. ఈ క్రమంలో, హాంకాంగ్ పూర్వపు వైభవాన్ని సంతరించుకునేందుకు చర్యలు చేపట్టింది. దేశంలో పర్యాటక రంగానికి పునరుజ్జీవం కల్పించేందుకు కొత్త ఆలోచనలు చేస్తోంది. వివిధ దేశాల పర్యాటకులను ఆకర్షించేందుకు హాంకాంగ్ ప్రభుత్వం 5 లక్షల విమాన టికెట్లను ఉచితంగా అందించనుంది. 

కరోనా సంక్షోభానికి ముందు హాంకాంగ్ ను ఏటా 56 మిలియన్ల మంది పర్యాటకులు సందర్శించేవారు. కానీ కరోనా వ్యాప్తి కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోవడం, దేశాలన్నీ సరిహద్దులను మూసివేయడంతో పర్యాటకం స్తంభించింది. 

ఇప్పుడు కరోనా వ్యాప్తి బాగా తగ్గిపోవడంతో, హాంకాంగ్ మళ్లీ పర్యాటకంపై దృష్టి సారించింది. రూ.2 వేల కోట్ల విలువైన విమాన ప్రయాణ టికెట్లను ఫ్రీగా ఇస్తామని టూరిస్టులను ఊరిస్తోంది. హాంకాంగ్ ఎయిర్ పోర్టు అథారిటీ ఈ టికెట్లను రెండేళ్ల క్రితమే దేశీయ విమాన సంస్థల నుంచి కొనుగోలు చేసింది. అటు పర్యాటకులను రాబట్టడంతో పాటు, ఇటు నష్టాలతో ఉన్న దేశీయ విమాన సంస్థలను ఆదుకున్నట్టు ఉంటుందని భారీ ఎత్తున విమాన టికెట్లను కొనుగోలు చేసింది. ఈ టికెట్లను హాంకాంగ్ వాసులకు కూడా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

కాగా హాంకాంగ్ వచ్చే విదేశీయులు వ్యాక్సిన్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. విమానం ఎక్కడానికి ముందు కరోనా పీసీఆర్ టెస్టులో నెగెటివ్ వచ్చినట్టు సర్టిఫికెట్ ను సమర్పించాలి. దాంతో పాటు రాపిడ్ యాంటీజెన్ టెస్టు కూడా తప్పనిసరి చేశారు. కాగా. ఉచిత టికెట్ల విధివిధానాలను హాంకాంగ్ ప్రభుత్వం త్వరలోనే వెల్లడించే అవకాశాలున్నాయి.
Hong Kong
Air Tickets
Tourists
Free
Covid

More Telugu News