Nagarjuna: నిరాశ పరుస్తున్న నాగార్జున 'ఘోస్ట్'.. డిజాస్టర్ అంటున్న ట్రేడ్ అనలిస్టులు

Nagarjunas Ghost movie is a disaster says analysts
  • తొలిరోజు రూ. 2 కోట్లు వసూలు చేసిన 'ఘోస్ట్'
  • రెండో రోజు రూ. 76 లక్షల వసూళ్లు
  • స్టోరీలో కంటెంట్ లేకపోవడమే కారణం అంటున్న విశ్లేషకులు
అక్కినేని నాగార్జున తాజా చిత్రం 'ఘోస్ట్' దసరా సందర్భంగా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే, ప్రేక్షకులను మెప్పించడంలో ఈ చిత్రం విఫలమయిందనే చెప్పుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా ఒక డిజాస్టర్ అని ట్రేడ్ అనలిస్టులు చెపుతున్నారు. ఈ చిత్రం తొలిరోజు రూ. 2 కోట్లను వసూలు చేసింది. రెండో రోజు నుంచి కలెక్షన్లు భారీగా పడిపోయాయి. సెకండ్ డే కలెక్షన్లు రూ. 76 లక్షలకు పడిపోయాయి. 

ఈరోజు పరిస్థితి ఇంకా దారుణంగా ఉందని తెలుస్తోంది. స్టోరీలో కంటెంట్ లేకపోవడమే సినిమా ఫెయిల్యూర్ కి కారణమని అంటున్నారు. ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంపై నాగార్జున, ఆయన అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రమోషన్లను కూడా పెద్ద ఎత్తున చేశారు. కానీ, ఫలితం నిరాశను మిగిల్చింది.
Nagarjuna
Ghost Movie
Tollywood
Collections

More Telugu News