Vijay Chandar: ఎంజీఆర్ వెనకడుగు వేసిన పాత్ర అది: విజయ్ చందర్

  • సీనియర్ నటుడిగా విజయ్ చందర్ కి పేరు 
  • 'కరుణామయుడు'తో పాప్యులర్ 
  • ఆ సినిమా కష్టాలు చెప్పిన నటుడు
  • షిరిడీ సాయిబాబా అనగానే గుర్తొచ్చేది కూడా ఆయనే
Vijay Chandar Interview

టాలీవుడ్ లోని సీనియర్ ఆర్టిస్టులలో విజయ్ చందర్ ఒకరు. ఆయన పేరు వినగానే 'కరుణామయుడు' సినిమాలోని యేసు క్రీస్తు పాత్ర, 'షిరిడీ సాయిబాబా మహాత్మ్యం'లో ఆయన పోషించిన బాబా పాత్ర కళ్లముందు కదలాడతాయి. 'సాక్షి' ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన 'కరుణామయుడు' సినిమాను గురించి ప్రస్తావించారు. 'కరుణామయుడు' సినిమాను తీయడానికి నేను చాలా కష్టాలు పడ్డాను. ఎందుకు ఇలా జరుగుతోందని చెప్పేసి చర్చిలో కూర్చుని బాధపడిన రోజులు ఉన్నాయి. 

యేసుక్రీస్తు పాత్రను ధరించడం వెనుక ఒక సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్ గురించి తెలిసి, క్రీస్తు సినిమాలో చేసే ఆలోచనను ఎంజీఆర్ మానుకున్నారు. అలాంటి ఒక పాత్రను చేయడం అంత తేలికైన విషయమేం కాదు. ఐదేళ్ల పాటు ఆగిపోయిన సినిమాను జనం ముందుకు తీసుకుని వెళ్లడానికి దినదినగండం అన్నట్టుగా అనేక సమస్యలను ఎదుర్కొన్నాను. 

రాముడు .. కృష్ణుడు అంటే ఎన్టీఆర్ పేరు ఎలా చెప్పుకుంటారో, బాబా - యేసు పాత్రల విషయానికి వస్తే నా పేరునే చెప్పుకుంటారు .. అది చాలు నాకు. 'కరుణామయుడు' సినిమా విడుదలయ్యేంత వరకూ నేను సినిమాలు చేయలేదు. ఆ పాత్ర నాకు తీసుకొచ్చిన పేరు వలన ఇతర సినిమాల్లో పాత్రలను ఇవ్వడానికి ఆలోచన చేశారు. ఆ తరహా పాత్రలను తప్ప వేరే పాత్రలను చేయలేననే ఒక ముద్రపడిపోయింది" అంటూ చెప్పుకొచ్చారు.  

More Telugu News