Nobel Prize: ఫ్రాన్స్ ర‌చ‌యిత్రి అన్నీ ఎర్నాక్స్‌కు నోబెల్ సాహిత్య పుర‌స్కారం

nobel prize in Literature is awarded to the French author Annie Ernaux
  • ఫ‌ర్ ద కరేజ్ అండ్ క్లినిక‌ల్ అక్యూటీ... కు నోబెల్ బ‌హుమ‌తి
  • 82 ఏళ్ల వ‌య‌సులో నోబెల్‌కు ఎంపికైన ఎర్నాక్స్‌
  • త‌న జీవితంలోని ఇతివృత్తాల‌తోనే పుస్త‌కాలు రాసిన ర‌చయిత్రి
సాహిత్యంలో ప్ర‌తిష్ఠాత్మ‌క నోబెల్ బ‌హుమ‌తి ఫ్రాన్స్ ర‌చ‌యిత్రి అన్నీ ఎర్నాక్స్‌ను వ‌రించింది. ఈ మేర‌కు రాయ‌ల్ స్వీడిష్ అకాడెమీ గురువారం సాయంత్రం ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఫ‌ర్ ద కరేజ్ అండ్ క్లినిక‌ల్ అక్యూటీ... పేరిట రాసిన పుస్తకానికి గాను ఆమెకు నోబెల్ బ‌హుమ‌తి ద‌క్కింది. 1974లోనే ర‌చ‌న‌లు మొద‌లుపెట్టిన ఎర్నాక్స్‌... ఈ ఏడాది త‌న 82వ ఏట నోబెల్ బ‌హుమ‌తికి ఎంపిక‌య్యారు.

సాహిత్యంలో ప్రొఫెస‌ర్‌గా ప‌నిచేసిన‌ ఎర్నాక్స్‌... ప్ర‌ధానంగా ఆటోబ‌యోగ్ర‌ఫీలు రాశారు. త‌న త‌ల్లిదండ్రుల‌తో త‌న అనుబంధం, త‌ద‌నంత‌రం త‌న జీవితంలో చోటుచేసుకున్న ప‌రిణామాల ఆధారంగా ర‌చ‌న‌లు చేశారు. తొలుత ఫిక్ష‌న్ న‌వ‌ల‌ల‌తోనే త‌న ప్ర‌స్థానం మొదలుపెట్టినా...ఆ త‌ర్వాత ఆటోబ‌యోగ్ర‌ఫీల దిశ‌గా ఆమె మారిపోయారు.
Nobel Prize
France
Annie Ernaux

More Telugu News