Software virus: బ్యాంకింగ్ యాప్స్​ టార్గెట్​ గా సోవా వైరస్​.. జాగ్రత్తగా ఉండాలంటున్న బ్యాంకులు

Banks warns against Sova trojan virus for android users
  • వివిధ రకాల ఆఫర్ల పేరిట ఫోన్లకు మెసేజీలు.. వాటిని క్లిక్ చేస్తే చొరబడుతున్న సోవా వైరస్
  • మన ఫోన్ లోని బ్యాంకింగ్ యాప్ ల లాగిన్ ఐడీలు, పాస్ వర్డ్ ల తస్కరణ
  • ఆ వివరాలతో ఖాతాలను ఖాళీ చేసేస్తున్న హ్యాకర్లు
బ్యాంకింగ్ సేవల కోసం యాప్ ల వినియోగం పెరిగిపోయిన నేపథ్యంలో.. బ్యాంకు యాప్ లు టార్గెట్ గా మన ఫోన్ లో చొరబడి, డబ్బులను ఖాళీ చేసే ‘సోవా’ వైరస్ దాడి చేస్తోందని బ్యాంకులు హెచ్చరిస్తున్నాయి. కొన్ని రకాల గేమింగ్ యాప్స్, ఫోన్ స్పీడ్ చేసే యాప్ లు, ఆన్ లైన్ లింకులను క్లిక్ చేయడం ద్వారా ఈ వైరస్ స్మార్ట్ ఫోన్లలో చొరబడుతున్నట్టు స్పష్టం చేస్తున్నాయి.

వివిధ రకాల మెసేజీలు, ఆఫర్ల పేరిట..
హ్యాకర్లు బ్యాంకుల నుంచి వచ్చినట్టుగా వివిధ రకాల ఆఫర్ల పేరిట మెసేజీలు, వాట్సాప్ లింకులను పంపుతున్నారు. వాటిని క్లిక్ చేస్తే సోవా వైరస్ మన ఫోన్ లోకి చొరబడి తిష్టవేస్తుంది. ఇది మన బ్యాంకింగ్ యాప్ లలో పాస్ వర్డ్, ఇతర లాగిన్ వివరాలను తస్కరించి.. హ్యాకర్లకు చేరవేస్తుంది. హ్యాకర్లు ఆ వివరాలతో మన బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును ఖాళీ చేసేస్తారు.

దీనిపై అప్రమత్తంగా ఉండాలని బ్యాంకులు ఇటీవల హెచ్చరికలు జారీ చేశాయి. సోవా వైరస్ కేవలం బ్యాంకింగ్ లావాదేవీలను పరిశలించడమే గాకుండా.. క్రిప్టో కరెన్సీ వాలెట్ల పాస్ వర్డ్ ఇతర వివరాలనూ సేకరించి హ్యాకర్లకు పంపుతున్నట్టు కూడా గుర్తించారు.

ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..
ఈ–మెయిల్, ఎస్సెమ్మెస్, వాట్సాప్ లలో ఆఫర్ల పేరిట వచ్చే ఎటువంటి లింకులపై క్లిక్ చేయవద్దు. కేవలం గూగుల్ ప్లేస్టోర్ వంటి అధికారిక స్టోర్ లు, వెబ్ సైట్ల నుంచి మాత్రమే యాప్ లను డౌన్ లోడ్ చేసుకోవాలి. పలు రకాల గేమింగ్ యాప్స్, ఫోన్లను వేగంగా పనిచేస్తాయని, డేటాను క్లీనింగ్ చేస్తాయని చెప్తూ యాప్స్ ను ఇన్ స్టాల్ చేసుకోకపోవడం చాలా మంచిదని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఫోన్ లో అనవసర, థర్డ్ పార్టీ యాప్స్ ఏవైనా ఉంటే వెంటనే తొలగించుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

Software virus
Android
Android virus
Sova virus
Tech
Tech-News
Banking apps

More Telugu News