కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై బొత్స స్పందన
- ఏపీలో ఉన్న వివిధ పార్టీల్లో ఒక పార్టీగా బీఆర్ఎస్ ఉంటుందన్న బొత్స
- ఎన్ని పార్టీలు ఉంటే వైసీపీకి అంత మేలని వ్యాఖ్య
- మూడు రాజధానులే తమ వైఖరి అన్న బొత్స
ఇదే సమయంలో అమరావతి రైతుల పాదయాత్రపై ఆయన విమర్శలు గుప్పించారు. ఎవరి కోసం ఈ పాదయాత్ర చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. టీడీపీ నేతలు, రియలెస్టేట్ వ్యాపారుల కోసం పాదయాత్ర చేస్తున్నారని అన్నారు. మూడు రాజధానులే తమ ప్రభుత్వ వైఖరి అని చెప్పారు. ఉత్తరాంధ్రకు గత టీడీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై టీడీపీతో చర్చకు సిద్ధమని అన్నారు.