Gujarat: రావణుడిని కాదు.. సీబీఐ, ఈడీ, ద్రవ్యోల్బణం దిష్టిబొమ్మలను దహనం చేసిన గుజరాత్ కాంగ్రెస్

  • కచ్ జిల్లాలోని భుజ్‌లో కాంగ్రెస్ కార్యకర్తల నిరసన
  • హమిర్సార్ సరస్సు వద్ద దిష్టిబొమ్మల దహనం
  • ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
  • ప్రతిపక్షాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసి గొల్పుతోందని ఆరోపణ
Not Ravana effigies of ED CBI and inflation burnt in Gujarats Bhuj

చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే దసరా రోజున రావణుడి ప్రతిమను దహనం చేయడం అనాదిగా వస్తోంది. అయితే, గుజరాత్‌లో మాత్రం రావణుడి ప్రతిమకు బదులుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ద్రవ్యోల్బణం దిష్టిబొమ్మలను దహనం చేశారు. కచ్ జిల్లాలోని భుజ్‌లో కాంగ్రెస్ నేతలు వీటిని దహనం చేశారు. 

బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భుజ్‌లోని హమిర్సార్ సరస్సు వద్ద నిరసన తెలిపిన కాంగ్రెస్ నేతలు రావణుడి ప్రతిమకు బదులుగా ఈడీ, సీబీఐ, ద్రవ్యోల్బణం దిష్టిబొమ్మలను దహనం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో అధిక ధరలు, ద్రవ్యోల్బణం, ఆరోగ్య సౌకర్యాల లేమి, విద్య ఖరీదుగా మారడం, జీఎస్టీ వంటి వాటిపై కాంగ్రెస్ నిరసన తెలుపుతోంది. సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

  • Loading...

More Telugu News