దేవరగట్టులో వైభవంగా బన్నీ ఉత్సవం.. కర్రల సమరంలో 50 మందికి గాయాలు
- కర్నూలు జిల్లాలో దేవరగట్టులో కొలువైన శ్రీ మాళ మల్లేశ్వర స్వామి
- దసరా రోజున వైభవంగా బన్నీ ఉత్సవం
- స్వామి వారి విగ్రహాలను దక్కించుకునేందుకు గ్రామస్థుల కర్రల పోరు
- కర్రల సమరానికి వస్తూ కర్ణాటకకు చెందిన బాలుడి మృతి
స్వామి వారి మూర్తులను చేజిక్కించుకునేందుకు ఇరు వర్గాలు కర్రలతో హోరాహోరీగా తలపడతాయి. ఏళ్లుగా వస్తున్న ఆచారమిది. వర్షం కారణంగా ఈసారి కర్రల సమరం కొంత ఆలస్యంగా ప్రారంభమైంది. అనంతరం జరిగిన సమరంలో 50 మంది గాయపడినట్టు పోలీసులు తెలిపారు. కాగా, కర్రల సమరాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల జిల్లాల నుంచే కాదు, రాష్ట్రాల నుంచి కూడా తరలివస్తారు. ఈ కర్రల సమరంలో గతంలో తలలు పగిలి మరణించిన ఘటనలు కూడా ఉన్నాయి.