New Delhi: భర్త బర్గర్లు పంచాలి.. భార్య రూ.4.5 లక్షలు చెల్లించాలి.. భార్యాభర్తల కేసులో కోర్టు ఆదేశం

  • మొదట గొడవలతో కేసులు పెట్టుకున్న భార్యాభర్తలు
  • కొన్నేళ్ల తర్వాత రాజీకి వచ్చి కేసును వెనక్కి తీసుకునేందుకు దరఖాస్తు
  • కోర్టు సమయాన్ని వృధా చేయడంపై న్యాయమూర్తి ఆగ్రహం.. ఇద్దరికీ శిక్షలు
Wasting time delhi hc orders man serve burgers orphans

వారిద్దరూ భార్యాభర్తలు.. కొన్నాళ్లు బాగానే కలిసున్నా.. తర్వాత విడిపోయారు. అతను మరో పెళ్లి చేసుకున్నాడు. కానీ మాజీ భార్య తన మాజీ భర్తపై కోర్టుకు ఎక్కింది. కలిసి ఉన్న సమయంలో తనపై తీవ్రంగా వేధింపులకు, అత్యాచారాలకు పాల్పడ్డాడని ఫిర్యాదు చేసింది. ఈ కేసు విచారణలో ఉంది. అయితే కొన్నాళ్ల తర్వాత ఆ మాజీ భార్యాభర్తలు కలిసి కోర్టుకు వచ్చి.. తమ కేసులను వెనక్కి తీసుకుంటామని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

రెండేళ్లుగా కోర్టు విచారణ
ఢిల్లీలోని నోయిడాకు చెందిన వ్యక్తికి మయూర్‌ విహార్‌ ప్రాంతంలో బర్గర్‌ సింగ్‌, వాట్‌ ఏ బర్గర్‌ పేరుతో రెస్టారెంట్లు ఉన్నాయి. వ్యక్తిగత కారణాలతో తన భార్యకు విడాకులు ఇచ్చిన అతను మరో వివాహం చేసుకున్నాడు. ఇది గడిచి కొద్దిరోజులు అయిన తర్వాత.. 2020లో మాజీ భార్య కోర్టుకు వెళ్లింది. తాను వైవాహిక బంధంలో ఉన్న సమయంలో భర్త తనను శారీరకంగా, మానసికంగా తీవ్రంగా హింసించాడని ఫిర్యాదు చేసింది. దీనిపై రెండేళ్లుగా కోర్టులో విచారణ కొనసాగుతోంది.

విలువైన సమయాన్ని వృధా చేశారని..
ఇటీవల న్యూఢిల్లీ సాకేత్‌ కోర్టులో మాజీ భార్యాభర్తలు రాజీకి వచ్చారు. మాజీ భర్తపై కేసు వెనక్కి తీసుకునేందుకు భార్య అంగీకరించింది. కానీ ఈ పరిణామంపై జస్టిస్‌ సింగ్‌ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు మాజీ భార్యాభర్తలు అటు పోలీసులకు, ఇటు కోర్టులకు విలువైన సమాయాన్ని వృథా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు సమాజానికి పనికివచ్చే చర్యలు చేయాలని ఆదేశించారు.

  • బర్గర్ రెస్టారెంట్లు ఉన్న సదరు మాజీ భర్తను ఏవైనా రెండు అనాధాశ్రమాల్లో కనీసం వంద మందికిపైగా అనాథలకు బర్గర్ లను ఉచితంగా అందించాలని ఆదేశించింది. పోలీసులు దగ్గరుండి ఈ వ్యవహారాన్ని చూసుకోవాలని సూచించింది.
  • అటు మాజీ భార్యకూ శిక్ష విధించింది. రూ.4.5 లక్షలను కోర్టుకు పరిహారంగా చెల్లించాలని.. మాజీ భర్త బర్గర్లు పంచే రోజునే ఆ పరిహారం సొమ్మును చెల్లించాలని ఆదేశించింది.

More Telugu News