కేసీఆర్ను ఆదిపురుష్తో పోలుస్తూ గ్రీటింగ్స్ చెప్పిన రాంగోపాల్ వర్మ
- కేసీఆర్ ప్రకటన మరుక్షణమే సోషల్ మీడియా వేదికగా స్పందించిన వర్మ
- టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి ఆదిపురుష్గా కేసీఆర్ నిలిచారని వ్యాఖ్య
- కేసీఆర్కు జాతీయ రాజకీయాల్లోకి స్వాగతం అంటూ కామెంట్
టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మారుస్తూ కేసీఆర్ ప్రకటించిన మరుక్షణమే సోషల్ మీడియా వేదికగా రాంగోపాల్ వర్మ స్పందించారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన కేసీఆర్ ఆదిపురుష్గా నిలిచారు. ఈ తరహా ప్రయోగం చేసిన తొలి నేతగా కేసీఆర్ నిలిచారని ఆయన పేర్కొన్నారు. అంతటితో ఆగని వర్మ... జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్కు స్వాగతం పలికారు.