ఆదిపురుష్ దర్శకుడిపై ప్రభాస్ ఆగ్రహంగా ఉన్నాడా? వీడియో చూడండి..
- అభిమానులను తీవ్రంగా నిరుత్సాహపరిచిన చిత్ర టీజర్
- వీఎఫ్ ఎక్స్, యానిమేషన్ నాసిరకంగా ఉండటంతో టీజర్‌పై ట్రోలింగ్
- ఈ విషయంలో ఓం రౌత్‌పై ప్రభాస్ కోపంగా ఉన్నాడని ప్రచారం
టీజర్ కు వస్తున్న స్పందన తర్వాత చాలా నిరుత్సాహపడ్డ ప్రభాస్.. దర్శకుడిపై ఆగ్రహంగా ఉన్నాడన్న వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభాస్ కోపంగా కనిపిస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ వీడియోలో అతను దర్శకుడు ఓం రౌత్‌ని తన గదికి రమ్మని అడగడం కనిపించింది. "ఓం, నువ్వు నా రూమ్‌కి వస్తున్నావ్ కదా. నాతో రా" అని ప్రభాస్ వేలు చూపిస్తూ రౌత్‌కు చెప్పాడు. దాంతో, ప్రభాస్, ఓం రౌత్ మధ్య అంతా బాగాలేదని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆదిపురుష్ టీజర్ ను విడుదల చేసిన సమయంలో ఈ సంఘటన జరిగిందని తెలుస్తోంది. అయితే, ఓ రౌత్‌తో ప్రభాస్ ఏం మాట్లాడాడనే విషయం వెల్లడి కాలేదు.