Chandrababu: అధర్మంపై పోరాడే కొద్దీ మనలో శక్తి పెరుగుతుంది: చంద్రబాబు

Chandrababu and Lokesh wishes to people on dasara
  • ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, లోకేశ్
  • సంకల్పాలను నెరవేర్చుకునే శక్తిని ప్రజలకు ఇవ్వాలన్న బాబు
  • చేపట్టిన అన్ని పనుల్లోనూ విజయం సాధించాలన్న లోకేశ్
విజయ దశమిని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దసరా అంటే శక్తి పూజ అని పేర్కొన్న చంద్రబాబు.. అధర్మంపై పోరాడే కొద్దీ మనలో శక్తి ఎదుగుతుందని అన్నారు. అంతిమంగా అది విజయాన్ని అందిస్తుందని, చెడును నిర్మూలిస్తుందని అన్నారు. దుర్గమ్మ అవతారాలు మనకు చెప్పేది ఇదేనని పేర్కొన్నారు. సంకల్పాలను నెరవేర్చుకునే శక్తి ఆ జగన్మాత అందరికీ అనుగ్రహించాలని కోరుకుంటున్నట్టు చెబుతూ.. తెలుగు ప్రజలకు, వారి కుటుంబాలకు చంద్రబాబు విజయ దశమి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. 

టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేస్తూ.. చెడుపై మంచి సాధించిన విజయానికి దసరా ప్రతీక అని అన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. దుర్గామాత ఆశీస్సులతో అందరూ సుఖశాంతులతో ఉండాలని, చేపట్టిన కార్యక్రమాలన్నింటిలోనూ విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు.
Chandrababu
Nara Lokesh
Vijaya Dasami
Andhra Pradesh

More Telugu News