KCR: 80 యూనిట్లు, ఒక్కో యూనిట్ కు ఒక్కో ఎమ్మెల్యే ఇంఛార్జ్... మునుగోడు ఉప ఎన్నికకు కేసీఆర్ భారీ ప్లాన్

  • జాతీయ పార్టీని ప్రారంభించబోతున్న కేసీఆర్
  • మునుగోడు ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ అధినేత
  • దసరా మరుసటి రోజు నుంచి నేతలంతా మునుగోడులోనే
KCR big plan for Munugode by polls

మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. అన్ని ప్రధాన పార్టీలు విజయమే లక్ష్యంగా అస్త్రశస్త్రాలను తీస్తున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ భారీ ప్లాన్ చేస్తోంది. దసరా మరుసటి రోజు నుంచి పార్టీ యంత్రాంగమంతా మునుగోడులోనే మోహరించేలా ముఖ్యమంత్రి ప్లాన్ చేశారు. మునుగోడు నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా విభజించారు. ఒక్కో యూనిట్ కు ఒక్కో ఎమ్మెల్యేను ఇన్ఛార్జిగా నియమించారు. 

ఎన్నిక ప్రచారసరళిని పర్యవేక్షించే బాధ్యతను కేటీఆర్, హరీశ్ రావులకు అప్పగించారు. ఒక్కో యూనిట్ లో ఎమ్మెల్యే కింద 20 మంది నేతలు ప్రచార పర్వంలో పాల్గొంటారు. అక్టోబర్ 6 నుంచి నియోజకవర్గంలోని ప్రతి గడపను చుట్టేశాలా కేసీఆర్ ప్రణాళిక రచించారు. దసరా మరుసటి రోజు నుంచి ఎన్నిక జరిగేంత వరకు ఇన్ఛార్జీలంతా మునుగోడులోనే ఉండాలని కేసీఆర్ ఆదేశించారు. జాతీయ పార్టీని ప్రకటించనున్న నేపథ్యంలో... మునుగోడు ఉపఎన్నికను కేసీఆర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఇంకా ప్రకటించాల్సి ఉంది.

  • Loading...

More Telugu News