విషమంగానే ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం.. కిడ్నీ ఇస్తానన్న సమాజ్‌వాదీ పార్టీ నేత
- తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ములాయం సింగ్
- అవసరమైతే కిడ్నీ ఇస్తానన్న పార్టీ నేత అజయ్ యాదవ్
- ‘నేతాజీ’ని చూసేందుకు ఆసుపత్రికి ఎవరూ రావొద్దన్న సమాజ్‌వాదీ పార్టీ
కాగా, ములాయం చికిత్స పొందుతున్న గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రికి ఎవరూ రావొద్దని సమాజ్ వాదీ పార్టీ కోరింది. ములాయంకు ప్రస్తుతం క్రిటికల్ కేర్ యూనిట్లో చికిత్స కొనసాగుతోందని, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని పేర్కొంది. ఆసుపత్రికి వెళ్లినా ‘నేతాజీ’ని కలవడం సాధ్యం కాదని, కాబట్టి ఎవరూ ఆసుపత్రికి రావొద్దని విజ్ఞప్తి చేసింది. ములాయం ఆరోగ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తామని తెలిపింది. మరోవైపు, ములాయం తర్వగా కోలుకోవాలని కోరుతూ ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ప్రార్థనలు చేస్తున్నారు.