Direct flight: విజయవాడ నుంచి దుబాయికి డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్

Direct flight service to commence between Vijayawada to Dubai from 29 October
  • వారంలో రెండు సార్లు నిర్వహణకు నిర్ణయం
  • ఎయిర్ పోర్ట్ అడ్వైజరీ కమిటీ భేటీలో ప్రకటన 
  • ఢిల్లీకి అదనంగా మరో విమాన సర్వీసు
విజయవాడ చుట్టుపక్కల వాసులకు సంతోషాన్నిచ్చే వార్త ఇది. దుబాయి వెళ్లేందుకు వారు మరీ దూరంలో ఉన్న హైదరాబాద్, చెన్నై, విశాఖ విమానాశ్రయాలకు వెళ్లనక్కర్లేదు. విజయవాడ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటే చాలు. ఈ నెల 29 నుంచి దుబాయికి డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసును విజయవాడ విమానాశ్రయం నుంచి నడపనున్నట్టు ఎయిర్ పోర్ట్ అడ్వైజరీ కమిటీ శనివారం నాటి భేటీలో అధికారి ఒకరు వెల్లడించారు. వారంలో రెండు విమాన సర్వీసులు విజయవాడ నుంచి అందుబాటులో ఉంటాయి. 

విజయవాడ నుంచి ముంబైకి, విజయవాడ నుంచి వారణాసికి విమాన సర్వీసులు ఇప్పటికే నడుస్తుండగా, వీటిని తిరిగి సమీక్షిస్తామన్నారు. త్వరలో ఢిల్లీకి మరో విమాన సర్వీసు కూడా నడిపించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో విమానాశ్రయ అభివృద్ధి పనులను సైతం సమీక్షించారు.
Direct flight
Vijayawada to Dubai
Vijayawada
dubai

More Telugu News