Telangana: దసరా సెలవుల్లో తరగతులు నిర్వహించారో జాగ్రత్త!: జూనియర్ కాలేజీలకు తెలంగాణ ఇంటర్‌బోర్డు హెచ్చరిక

  • తెలంగాణలో రేపటి నుంచి జూనియర్ కాలేజీలకు దసరా సెలవులు
  • ఈ నెల 10న మళ్లీ తెెరుచుకోనున్న కళాశాలలు
  • సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరిక
Action Will be taken if junior Colleges they works in dasara holidays

తెలంగాణలో జూనియర్ కాలేజీలకు రేపటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించారు. తిరిగి 10న కాలేజీలు తెరుచుకుంటాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఇంటర్‌బోర్డు కీలక ప్రకటన చేసింది. సెలవుల్లో కనుక ప్రైవేటు కళాశాలలు తరగతులు నిర్వహిస్తే వాటి గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించింది. 

అలాగే, కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లపైనా చర్యలు ఉంటాయని పేర్కొంది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపారు. అన్ని ప్రైవేట్, ప్రభుత్వ, ఎయిడెడ్, కో ఆపరేటివ్, గురుకుల కాలేజీలకు ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు.

More Telugu News