ఉన్న దరిద్రం చాలదన్నట్టు కేసీఆర్ ఇప్పుడు దేశంపై పడుతున్నారట: వైఎస్ షర్మిల
- త్వరలోనే కేసీఆర్ జాతీయ పార్టీ
- సెటైర్లు వేసిన షర్మిల
- ఏ వర్గాన్ని కేసీఆర్ ఆదుకోలేదని విమర్శలు
ప్రజాసమస్యలను, రైతులను కేసీఆర్ పట్టించుకోవడంలేదని షర్మిల విమర్శించారు. తెలంగాణలో ఏ వర్గాన్ని అయినా కేసీఆర్ ఆదుకున్నారా? అని ప్రశ్నించారు. కాగా, షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర 169వ రోజు కొనసాగుతోంది. ఆందోల్ నియోజకవర్గం చింతకుంటలో ప్రారంభమై చండూర్, చిట్కూల్ మీదుగా సాగుతోంది.